
ప్రేక్షకులను మరోసారి జార్జ్ కుట్టి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు మోహన్‌లాల్ సిద్ధమయ్యారు. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్‌లాల్ కాంబినేషన్‌లోని ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది.

ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే వచ్చిన ‘దృశ్యం 1, దృశ్యం 2’ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లోనే ‘దృశ్యం 3’ రానుంది.

ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం కేరళలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాల్లో నటించిన మీనా ‘దృశ్యం 3’లోనూ నటిస్తున్నారు.

జార్జ్ కుట్టి పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. ‘‘జార్జ్ కుట్టి ప్రపంచం మళ్లీ జీవం పోసుకుంది. ‘దృశ్యం 3’ పూజా కార్యక్రమాలతో మొదలైంది’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా మోహన్ లాల్ పోస్ట్ చేశారు.






