'గతం నిశ్శబ్దంగా ఉండదు'.. మోహన్ లాల్ దశ్యం-3 ఎప్పుడంటే? | Mohanlal announces Drishyam 3 Release in this month | Sakshi
Sakshi News home page

Drishyam 3 Release: మోహన్ లాల్ దశ్యం-3.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Jun 21 2025 8:14 PM | Updated on Jun 21 2025 8:41 PM

Mohanlal announces Drishyam 3 Release in this month

దృశ్యం సినిమా సిరీస్‌కు ఆడియన్స్‌లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు పార్టులు విడుదలై అభిమానులను అలరించాయి. మలయాళంలో వచ్చిన ఈ సినిమాను అటు తెలుగులో.. ఇటు బాలీవుడ్‌లోనూ రిలీజ్‌ చేయగా సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ సూపర్ హిట్‌ మూవీ సిరీస్‌లో దృశ్యం-3 కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.  అయితే తాజాగా దృశ్యం-3 రిలీజ్‌ ఎప్పుడనేది కూడా మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ ఏడాది ‍అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల కానుందనిప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

దృశ్యం మూవీపై మోహన్ లాల్ మాట్లాడుతూ.. 'దృశ్యం సినిమా మలయాళ పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. కొవిడ్ మహమ్మారి సమయంలో మేము ఆ చిత్రాన్ని నిర్మించాం. ఆ చిత్రాన్ని  భారతదేశమంతా వీక్షించింది. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మలయాళ పరిశ్రమ గురించి తెలుసు. దృశ్యం తర్వాత మరిన్ని మలయాళ చిత్రాలను చూడటం ప్రారంభించారు. ఇది మా పరిశ్రమకు, అంతర్జాతీయంగా కూడా ఒక వరంలా మారింది." అని సంతోషం వ్యక్తం చేశారు.

'దృశ్యం సూపర్ హిట్ తర్వాత హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, సింహళీ, చైనీస్ భాషలలో కూడా రీమేక్ చేశారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో 'దృశ్యం 3' హిందీ వర్షన్ సైతం అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మలయాళ సినిమాను రీమేక్ చేస్తారా? లేదంటే సొంతగా కథను తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. తొలి రెండు భాగాలు మలయాళం  నుంచి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
 

 

Advertisement
 
Advertisement
Advertisement