breaking news
Jasmine Sandlas
-
లైవ్ కచేరీలో గుడ్ న్యూస్ చెప్పిన ‘ధురంధర్’ సింగర్
ప్రముఖ పంజాబీ గాయని, 'యార్ నా మిలే' ఫేమ్ జాస్మిన్ సాండ్లాస్ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన తన ' ది డ్రీమ్ గర్ల్ ఇండియా' లైవ్ కచేరీ స్టేజీపైనే ఆమె తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. తన కాబోయే భర్త శేఖర్ చౌదరిని అభిమానులకు పరిచయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.స్టేజీపైనే నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచే జాస్మిన్, ఈ కచేరీలో మాత్రం ఎంతో ఉత్సాహంగా కనిపించారు. యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఈవెంట్లో అభిమానుల కోలాహలం మధ్య ఆమె తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపించారు. అనంతరం శేఖర్ చౌదరిని స్టేజీపైకి ఆహ్వానిస్తూ..‘ఇతనే నా వ్యక్తి, నా వేలికి ఉంగరం తొడిగిన నా చౌదరి సాబ్’ అంటూ ఎంతో సంతోషంగా పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఈ జంట జాస్మిన్ పాడిన ప్రసిద్ధ పంజాబీ గీతం 'లావన్' బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా స్టేజీపై రొమాంటిక్‌గా నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు ఈ కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అలరించిన 'ది డ్రీమ్ గర్ల్ ఇండియా'పంజాబ్ సింగర్ జాస్మిన్ శాండ్లాస్ గాత్రానికి లక్షలాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పాటలకు మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ‘ధురంధర్’ సినిమాలో ఆమె ఆలపించిన ‘తెను షరాత్‌సికా’ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో హచ్‌చల్ చేస్తోంది. ఈ పాటకు లక్షలాది మంది రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో మిలియన్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె ఢిల్లీలో 'ది డ్రీమ్ గర్ల్ ఇండియా' పేరుతో కచేరీ నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఆమె గోల్డెన్ లెహంగా ధరించి ఎంతో అందంగా మెరిశారు. తన కెరీర్ లోని సూపర్ హిట్ పాటలైన 'ధురంధర్', 'శరారత్', 'జాయే సజనా', 'యార్ నా మిలే', 'తరస', 'ఇలీగల్ వెపన్' వంటి పవర్ ఫుల్ పాటలతో స్టేజ్‌పై ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఢిల్లీ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఢిల్లీ తర్వాత ఈ టూర్ ముంబై, బెంగళూరు, చండీగఢ్‌లలో కూడా కొనసాగనుంది. -
ఒంటిపై నీళ్లు పోసుకొని, పెదాలు ఆడించిన సింగర్, ఇదేం లైవ్?
ఈ మధ్య సంగీత కచేరీకి ప్రాధాన్యత పెరిగింది. స్టార్ సింగర్స్ అంతా.. మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తుండడంతో.. మ్యూజిక్ లవర్స్ ఆ ఈవెంట్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం లైవ్ కాన్సర్ట్ అని చెప్పి..రికార్డింగ్ పాటను ప్లే చేయడం ఇప్పుడు సంగీత ప్రియులను ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ధురంధర్ సింగర్ జాస్మిన్ సాండ్లాస్ కూడా బ్యాగ్రౌండ్లో ప్లే అవుతున్న పాటకు లిప్ సింక్ ఇచ్చి.. లైవ్‌లో పాడుతున్నట్లుగా మోసం చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది.లైవ్ కాన్సర్ట్ కానీ.. ధురంధర్ సినిమా రిలీజ్ తర్వాత సింగర్ జాస్మిన్ సాండ్లాస్ మరింత ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాలో ఆమె ఆలపించిన షరారత్, మై ఔర్ తూ, ఆరీ ఆరీ పాటలు సూపర్ హిట్ అవ్వడం.. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో జాస్మిన్ పేరు మారుమోగిపోయింది. ఆ ఫేమ్‌ని సొమ్ము చేసుకునేందుకు జాస్మిన్ రెడీ అయింది. అందులో భాగంగా ఏప్రిల్ 19న గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌లో సంగీత కచేరి నిర్వహించింది. ధురంధర్ సింగర్ మ్యూజిక్ కాన్సర్ట్ అని తెలియడంతో వందలాది మంది సంగీత ప్రియులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఈవెంట్‌కి వెళ్లారు. జాస్మిన్ కూడా వారిని నిరాశపరచకుండా తన పాటలతో మంత్రముగ్ధుల్ని చేసింది.పాడడం కోసమా లేదా యాక్టింగ్ కోసమా?ఈవెంట్‌కి వచ్చినవారిని మరింత ఉత్సాహపరిచేందుకు ధురంధర్ పాటను ఆలపిస్తూ..తలపై నీళ్లు పోసుకుంది. అంతేకాదు పాటతో పాటు డ్యాన్స్ కూడా చేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఆ వీడియో క్లిప్ పరిశీలిస్తే.. జాస్మిన్ పాట పాడలేదు. బ్యాగ్రౌండ్లో ప్లే అవుతున్న పాటకి పెదాలను కదిపారు అంతే. ఇది గమనించిన నెటిజన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాటు తలపై నీళ్లు పోసుకోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ‘లైవ్ కాన్సర్ట్ అని చెబుతారు.. కానీ లైవ్‌లో పాట పాడరు’, ‘ఆమెను పాట పాడడానికి పిలిపించారా లేదా నటించడానికి పిలిపించారా?’, ‘తలపై పోసుకున్న నీళ్లు సరిపోలేదు..ఇంకో బకెట్ నీళ్లు పోసుకోవాల్సింది’అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @exclusive.celebs -
పాట పాడలేనన్న ‘ధురంధర్’ సింగర్.. నెటిజన్లు ప్రశంసలు
అది ప్రముఖ సింగర్ కచేరి. వేలాది మంది తరలి వచ్చారు. ఆ సింగర్ తన గాత్రంతో సంగీత ప్రియుల్ని మంత్రముగ్థుల్ని చేస్తోంది. అందరూ ఆమె పాటలో లీనమైపోయారు. అంతే.. సడెన్‌గా ఆమె తన పాటను ఆపేసింది.న ఇద్దరు యువకులను చూసిస్తూ.. వాళ్లను పంపించకపోతే పాడేదే లేదంటూ హుకుం జారీ చేసింది. ఇది చూసి అక్కడున్నవారంతా సింగర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ కూడా సదరు గాయని చేసిన పనికి ఫిదా అవుతూ.. మంచి నిర్ణయం తీసుకుందంటూ కొనియాడారు. ఇంతకీ ఆ గాయని ఎవరు? మధ్యలోనే పాటను ఆపడానికి గల కారణం ఏంటి?పంజాబ్ సింగర్ జాస్మిన్ శాండ్లాస్ గాత్రానికి లక్షలాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పాటలకు మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ‘ధురంధర్’ సినిమాలో ఆమె ఆలపించిన ‘తెను షరాత్‌సికా’ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో హచ్‌చల్ చేస్తోంది. ఈ పాటకు లక్షలాది మంది రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో మిలియన్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదే జోష్‌లో ఆమె తాజాగా ఢిల్లీలో సంగీత కచేరి నిర్వహించింది. ఈ కచేరీకి వేలాది మంది సంగీత ప్రియులు వచ్చారు.జాస్మిన్ పాటలను ఆలపిస్తున్న క్రమంలో.. ఇద్దరు ఆకతాయి కుర్రాళ్లు.. అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించడాన్ని ఆమె గమనించారు. వెంటనే పాటను మధ్యలో ఆపేసి.. ‘సెక్యూరిటీ.. దయచేసి అక్కడున్న ఇద్దరు అబ్బాయిలను బటయకు పంపించండి. వాళ్లు అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు. నా కచేరీలో మహిళలు సురక్షితంగా లేకుంటే.. పాడడం ఆపేస్తా’ అని ఆమె హెచ్చరించింది. వాళ్లను బయటకు పంపేవరకు ఆమె ఆలపించలేదు. చివరకు అక్కడి సిబ్బంది ఆ ఇద్దరి యువకులను బయటకు పంపడంతో జాస్మిన్ తన కచేరిని కొనసాగించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న యువకుల పట్ల ఆమె ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తనకోసం వచ్చి మహిళల రక్షణ కోసం ఆమె గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడుతున్నారు. View this post on Instagram A post shared by Gulabi Queen (@lifeofgulabiqueen)


