రామ్‌ చరణ్‌ కంటికి గాయం.. చిరంజీవి ఏమన్నారంటే..: బుచ్చిబాబు | Buchibabu Reveals Chiranjeevi Reaction When Ram Charan Eye Injury At Peddi Shooting | Sakshi
Sakshi News home page

అప్పుడు చిరంజీవి తిడతాడేమోనని భయపడ్డా : బుచ్చిబాబు

Jun 2 2026 5:23 PM | Updated on Jun 2 2026 5:49 PM

Buchibabu Reveals Chiranjeevi Reaction When Ram Charan Eye Injury At Peddi Shooting

‘పెద్ది’ షూటింగ్‌ సమయంలో రామ్‌ చరణ్‌ పలు సార్లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అవన్నీ బయటకు రాలేదు కానీ..కంటికి గాయమైన  విషయం మాత్రం క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అప్పుడు ఆందోళ చెందారు. చివరకు చిరంజీవి స్పందిస్తూ.. చిన్న సర్జరీ మాత్రమే జరిగిందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఆందోళన చెందాడట. అంతేకాదు ఈ విషయం చిరంజీవికి తెలిస్తే ఎంత తిడతాడేమోనని భయపడ్డాడట. కానీ చిరంజీవి మాత్రం ఒక్కమాట కూడా అనలేదని బుచ్చిబాబు చెప్పాడు.

తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. రామ్‌ చరణ్‌ కంటికి గాయం ఎలా గాయం అయిందో వివరించాడు. ‘ఫైట్‌ సీన్‌ షూటింగ్‌ సమయంలో చరణ్‌ కంటికి గాయం అయింది. కింద ఉన్న ఫైటర్‌ ఒక్కసారిగా లేవడంతో పైన ఉన్న చరణ్‌ కంటికి దెబ్బతాకింది. చాలా రక్తం పడిపోయింది. భయపడిపోయా. ఈ విషయం చిరంజీవి తెలిస్తే ఎంత తిడతాడేమోనని టెన్షన్‌ పడ్డా. భయంతోనే చిరంజీవికి కాల్‌ చేసి మాట్లాడా. అయితే ఆయన ఒక్క మాట కూడా అనలేదు. పైగా ‘ఆ వీడియో ఉంటే పంపు బుచ్చిబాబు’ అన్నాడు. అది విని నేనే షాకయ్యా’ అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement