'ఉప్పెన కంటే ఎక్కువ.. ఆయన లేకపోతే పెద్దినే లేదు' | Director Buchi Babu comments On Peddi Movie Success | Sakshi
Sakshi News home page

Peddi Movie: 'ఆయన లేకపోతే పెద్దినే లేదు.. బుచ్చిబాబు ఎమోషనల్ స్పీచ్'

Jun 5 2026 5:39 PM | Updated on Jun 5 2026 7:54 PM

Director Buchi Babu comments On Peddi Movie Success

రామ్ చరణ్‌ పెద్ది సక్సెస్‌తో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటిక్ రావడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు హాజరైన డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు అభిమానులకు బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రీమియర్స్ నుంచే నాకు ఫోన్ కాల్స్ రావడం మొదలైందన్నారు. పెద్ది విజయానికి కారణం రామ్ చరణ్‌ మాత్రమేనన్నారు. ఉప్పెన కంటే ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీలోని పెద్ది క్యారెక్టర్‌ ఆదర్శమని పలువురు కొనియాడారని తెలిపారు. చరణ్ గారు పడిన కష్టాన్ని అందరూ గుర్తించారు.. చరణ్ లేకపోతే ఈ సినిమా లేదు.. థ్యాంక్ యూ చరణ్ సార్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీనే పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించగా.. శృతిహాసన్ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement