పెద్ది పహిల్వాన్‌ లుక్.. రామ్ చరణ్ అంతలా కష్టపడ్డారా? | Ram Charan Latest Movie Peddi Glimpse Pahilwan Look Viral On Social Media, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Peddi Movie: రామ్ చరణ్ పహిల్వాన్‌ లుక్.. ఎనిమిది నెలల కఠోర శ్రమ..!

Mar 29 2026 5:08 PM | Updated on Mar 29 2026 6:07 PM

Ram Charan Latest Movie Peddi Glimpse Pahilwan Look Goes Viral

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్‌ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.

ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పహిల్వాన్‌గా చెర్రీ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. అయితే ఇలా రెజ్లర్‌గా కనిపించేందుకు గ్లోబల్ స్టార్‌ కఠినంగా డైట్‌ తీసుకున్నారు. పహిల్వాన్‌లా కనిపించేందుకు దాదాపు 8 నెలల పాటు కేవలం కఠోర నియమాలు పాటించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఈ లుక్ కోసం తీవ్రంగా శ్రమించారని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు రివీల్ చేశారు.

కఠినమైన డైట్..

పహిల్వాన్‌ ఫిజిక్ రావాలంటే ప్రత్యేక డైట్ పాటించాల్సి ఉంటుంది. కేవలం జిమ్‌లో వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు..కఠిన ఆహార నియమాలు కూడా ఫాలో కావాల్సిందే.  ఈ ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉంటూ కఠిన నియమాలు పాటించారు. ఎక్కడా కూడా తన ఫిట్‌నెస్ రూల్స్‌  బ్రేక్ చేయలేదని బుచ్చిబాబు సనా తెలిపారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement