రామ్ చరణ్ పెద్ది.. రిలీజ్ డేట్‌ మారనుందా? | Ram Charan Peddi Movie Release Date Twist, Peddi Likely To Release On June 4 As Yash Toxic Gets Postponed | Sakshi
Sakshi News home page

Peddi Release Update: రామ్ చరణ్ పెద్ది.. రిలీజ్ డేట్‌పై గుడ్ న్యూస్

Apr 30 2026 4:48 PM | Updated on Apr 30 2026 4:58 PM

Ram charan Peddi Coming to Early In Theatres talk Goes Viral

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్‌ డ్రామా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామి బుచ్చిబాబు ఇటీవలే ఓ ఈవెంట్‌లో ప్రకటించారు. ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండగా.. దాదాపు అది కూడా ఈ రోజుతో పూర్తయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

రిలీజ్‌ డేట్ మారే ఛాన్స్..?

అయితే పెద్ది మూవీ కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టంట టాక్ వినిపిస్తోంది. జూన్ 4 రిలీజ్‌ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ ఊహించినట్లే వాయిదా పడింది. దీంతో పెద్దిని 4 వ తేదీని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు పండగే. అనుకున్న టైమ్‌ కంటే ముందుగానే పెద్దిని బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం రానుంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement