'ఆ విషయంలో నన్ను క్షమించండి.. పెద్ది తీసేయడం అంత ఈజీ కాదు' | Director Buchi Babu Commets about Peddi Movie | Sakshi
Sakshi News home page

Peddi Movie: ' పెద్దిని తీసేయడం అంత ఈజీ కాదు'.. బుచ్చిబాబు కామెంట్స్

May 1 2026 7:01 PM | Updated on May 1 2026 7:01 PM

Director Buchi Babu Commets about Peddi Movie

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్‌ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్‌ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్‌ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్‌ సార్‌పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్‌ సార్‌కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌కు దర్శకుడు సుకుమార్‌, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు కూడా హాజరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement