పెద్ది సక్సెస్‌.. బుచ్చి బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్‌ స్టార్ హీరో అతడేనా? | Peddi Director Buchi Babu Sana next film with Mahesh Babu | Sakshi
Sakshi News home page

Buchi Babu: పెద్ది సక్సెస్‌.. టాలీవుడ్ స్టార్‌ హీరోతోనే చేయనున్నారా?

Jun 15 2026 11:51 AM | Updated on Jun 15 2026 12:25 PM

Peddi Director Buchi Babu Sana next film with Mahesh Babu

పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ ఎంజాయ్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. పెద్ది కథకు కారణం గ్రామీణ క్రీడాకారులను బయటి తీసుకురావడమే తన ఉద్దేశమని తెలిపారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితో పంచుకున్నారు. రామ్ చరణ్‌తో సినిమా తీశా.. భవిష్యత్తులో మీరు కూడా అవకాశమిస్తే చేస్తానని చిరుతో బుచ్చిబాబు సరదాగా అన్నారు.

అయితే పెద్ది హిట్ తర్వాత బుచ్చిబాబు ప్లాన్‌ నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ తదుపరి ప్రాజెక్ట్‌ కోసం ఎలా ముందుకెళ్తున్నారన్న ఇంట్రెస్ట్ నెలకొంది.  ఈ నేపథ్యంలోనే బుచ్చికి సంబంధించి ఓ టాక్‌ టాలీవుడ్‌లో నడుస్తోంది. ఇటీవల  హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ ఈవెంట్‌లో మహేశ్‌బాబుతో నెక్ట్స్ సినిమా చేస్తున్నారా? అని కొందరు ప్రశ్నించారు. కానీ దీనికి బుచ్చిబాబు రియాక్ట్ కాలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

మహేశ్ బాబుతో పౌరాణిక చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని బుచ్చిబాబును మరోసారి అడిగారు. దీనికి స్పందిస్చూ సరైన సమయం కోసం వేచి చూద్దాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు. కాలమే ఏదైనా నిర్ణయిస్తుందని హింట్ ఇచ్చారు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ మహేశ్‌బాబుతోనే అని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అరుదైన కాంబోపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 'వారణాసి' మూవీ రానుంది.ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు తరచుగా వినిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో బుచ్చి బాబు కూడా చేరారు. మరి ఎవరికీ ఓకే చెబుతాజో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement