రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
తాజాగా ఈ మూవీ రన్‌టైమ్ నెట్టింట చర్చ మొదలైంది. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. గతంలో రిలీజైన యానిమల్, కల్కి, పుష్ప-2, ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైమ్ కూడా 3 గంటలకు పైగానే ఉంది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా ఈ రన్ టైమ్ చూస్తుంటే పెద్ది కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని సినీ వర్గాల టాక్. అంతేకాకుండా
ఉత్తరాదిలో ట్రైలర్ రిలీజ్..
పెద్ది ట్రైలర్ విషయంలో బుచ్చిబాబు పుష్ప-2 ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పుష్ప-2 ట్రైలర్‌ను బిహార్‌లోని పాట్నాలో రిలీజ్ చేశారు. దీంతో నార్త్ ఆడియన్స్‌లోనూ ఓ రేంజ్‌లో వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే బాటలో పెద్ది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 17న ఇండోర్ లేదా పాట్నాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్‌లో ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.


