ఇంకా ట్రైలర్ రాలేదు.. అప్పుడే పెద్ది రికార్డ్..! | Ram Charan's Peddi Movie Creates Record in Pre Ticket Booking Sales | Sakshi
Sakshi News home page

Peddi Movie: ట్రైలర్ రిలీజ్‌కు ముందే పెద్ది రికార్డ్..!

May 8 2026 1:45 PM | Updated on May 8 2026 2:08 PM

Ram Charan's Peddi Movie Creates Record in Pre Ticket Booking Sales

రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం నుంచే ఓవర్‌సీస్ ఆడియన్స్‌కు టికెట్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చేశాయి.

ఓవర్‌సీస్‌లో తొలి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 24 గంటల్లోపే లక్ష టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. నార్త్ ‍అమెరికాలో అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. జూన్ 3వ తేదీన ప్రీమియర్ షోల టికెట్స్ ఓపెన్ అవ్వగా కేవలం కొన్ని గంటల్లోనే కొనేశారు. దీంతో ఉత్తర అమెరికాలో అత్యంత వేగంగా లక్షకు పైగా టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పెద్ది నిలిచింది. ఇటీవలే ఈ మూవీ ఫైనల్ కాపీ కూడా రెడీ అయిందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్ రిలీజ్‌ కాకపోయినా పెద్దికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ‍ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement