
గేమ్ ఛేంజర్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పటికే పెద్ది షాట్ పేరుతో గ్లింప్స్ విడుదల చేయగా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కొట్టిన షాట్ అద్భుతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం పెద్ది షూటింగ్ కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతోంది. ఓ స్పెషల్ సాంగ్‌ను జానీమాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వెయ్యిమందితో చిత్రీకరిస్తోన్న ఈ ప్రత్యేక సాంగ్ పెద్ది మూవీలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా మార్చి 27, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌లో వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
May Lord Ganesha bring peace, success and positivity into your lives.
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ✨@PeddiMovieOffl pic.twitter.com/DmGpC7wbuZ— Ram Charan (@AlwaysRamCharan) August 27, 2025