పెద్ది ఐటమ్ సాంగ్‌.. ఎట్టకేలకు స్టార్ హీరోయిన్‌ ఫిక్స్..! | Ram Charan Peddi Movie Item Song Actress Name Goes Viral | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది ఐటమ్ సాంగ్‌.. ఆ ముగ్గురు కాదు.. స్టార్‌ హీరోయిన్‌ ఫిక్స్..!

Apr 23 2026 4:45 PM | Updated on Apr 23 2026 6:42 PM

Ram Charan Peddi Movie Item Song Actress Name Goes Viral

రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా వేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకా ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండడంతో ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది జూన్‌కు షిఫ్టయ్యాడు. అయితే ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్‌ కోసం హీరోయిన్‌ ఎంపిక చేయకపోవడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. రోజుకొక హీరోయిన్ పేరు వినిపిస్తున్న వీటిపై అధికారిక ప్రకటనైతే రాలేదు.

ఇటీవలే సంయుక్త మీనన్‌ ఈ ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. గతంలో మృణాల్ ఠాకూర్, మానస అని పలువురు కూడా తెరపైకొచ్చాయి. కానీ అంతలోనే ఊహించని మరో స్టార్ హీరోయిన్‌ పేరు బయటకొచ్చింది. పెద్ది ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతి హాసన్‌ చేయనుందని లేటేస్ట్‌ టాక్ నడుస్తోంది. దాదాపు శృతిని మేకర్స్ ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒకవేళ ఇదే నిజమైతే పెద్ది సరసన శృతి హాసన్ చిందులేయనుంది. ఈ ఐటమ్ సాంగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సాంగ్ కచ్చితంగా స్పెషల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ‍హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement