CAT కథ వినూత్నంగా అనిపించింది: పెద్ది డైరెక్టర్‌ బుచ్చిబాబు | CAT First Look Launched By Buchibabu Sana | Sakshi
Sakshi News home page

CAT కథ వినూత్నంగా అనిపించింది: పెద్ది డైరెక్టర్‌ బుచ్చిబాబు

Jan 27 2026 5:35 PM | Updated on Jan 27 2026 5:44 PM

CAT First Look Launched By Buchibabu Sana

CAT ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

జీవీ నాయుడు, వీజే బాలు, లావణ్య, కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాట్‌’(CAT). వీఆర్‌జీఆర్‌ మూవీస్ బ్యానర్ పై వై. గంగాధర్  ఐపీఎస్‌ సమర్పణలో, రజని గొంగటి నిర్మించిన ఈ చిత్రానికి   జీవీ నాయుడు దర్శకత్వం వహించారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకులు బుచ్చి బాబు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. దర్శకుడు కమ్ యాక్టర్ జి.వీ నాయుడు నాకు ఎప్పటినుంచో తెలుసు, క్యాట్‌ స్టోరీ కూడా నాకు చెప్పాడు.ఈ కథ వినూత్నంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా  పెద్ద హిట్ అవ్వాలని అందరికి పేరు తీసుకురావాలని, త్వరలొ విడుదలకు సిద్దమైన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’అన్నారు.  డ్రామా, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతి రాజా సంగీతం అందించగా, పంకజ్‌ తొట్టాడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement