పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో బుచ్చిబాబు ఫ్యామిలీ | Peddi Director Buchi Babu Sana visits Tirumala temple ahead of Release | Sakshi
Sakshi News home page

Buchi Babu: పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో డైరెక్టర్ బుచ్చిబాబు

Jun 3 2026 9:05 PM | Updated on Jun 3 2026 9:05 PM

Peddi Director Buchi Babu Sana visits Tirumala temple ahead of Release

పెద్ది రిలీజ్ వేళ బుచ్చిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ది కోసం రామ్ చరణ్‌తో సహా తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.

కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూన్ 3 రాత్రి నుంచే పెద్ది ప్రీమియర్స్‌ షోలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement