పెద్ది సెట్స్‌లో మెగాస్టార్ సందడి.. వీడియో వైరల్ | Megastar Chiranjeevi at Peddi Movie Shooting Sets video Goes Viral | Sakshi
Sakshi News home page

Chiranjeevi: పెద్ది సెట్స్‌లో మెగాస్టార్ సందడి.. వీడియో వైరల్

May 8 2026 3:45 PM | Updated on May 8 2026 3:59 PM

Megastar Chiranjeevi at Peddi Movie Shooting Sets video Goes Viral

రామ్ చరణ్ మూవీ పెద్ది షూటింగ్ సెట్‌లో మెగాస్టార్ సందడి చేశారు. షూటింగ్ సెట్‌కు వెళ్లిన దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ది బాస్, మై గురు పెద్ది సెట్స్‌లో అడుగుపెట్టారని.. ఇది నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకమంటూ పోస్ట్ చేశారు. పెద్దిని ఆదర్శంగా తీసుకుని నా కండలు పెంచానని ఫన్నీగా రాసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement