పెద్ది ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. ఆ విషయంలో బిగ్‌ ట్విస్ట్‌..! | Ram Charan Peddi Movie Not released In 4DX Format | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. ఆ ఫార్మాట్‌ లేనట్లే..!

Jun 3 2026 2:49 PM | Updated on Jun 3 2026 3:03 PM

Ram Charan Peddi Movie Not released In 4DX Format

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది మూవీ ప్రీమియర్స్ షురూ కానున్నాయి. ఈ రోజు 8 గంటల నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

అయితే ఈ మూవీని పలు ఫార్మాట్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఐమ్యాక్స్, డాల్బీతో పాటు 4డీఎక్స్ ఫార్మాట్‌లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఆడియన్స్‌ ఎక్కువగా 4డీఎక్స్ ఫార్మాట్‌లో చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఈ ఫార్మాట్‌లో చూస్తే  వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది.

అయితే 4డీఎక్స్ ఫార్మాట్‌లో పెద్దిని రిలీజ్‌ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఇప్పటి వరకు ఈ వర్షన్‌లో టికెట్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. హైదరాబాద్‌తో సహా బార్కో లేజర్, ఎపిక్, డాల్బీ సినిమా ఫార్మాట్లతో మాత్రమే టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో 4డీఎక్స్‌ వర్షన్‌లో చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగలనుంది. ఈ విషయంలో మాత్రం పెద్ది మేకర్స్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారనే చెప్పుకోవాలి. 

peddi

 

Advertisement
 
Advertisement
Advertisement