రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా.. జగపతి బాబు లుక్ చూశారా? | Tollywood Actor Jagapathi Babu Special Video From Ram Charan Movie | Sakshi
Sakshi News home page

Jagapathi Babu: రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా.. జగపతి బాబు వీడియా వైరల్!

Jan 16 2025 3:08 PM | Updated on Jan 16 2025 3:40 PM

Tollywood Actor Jagapathi Babu Special Video From Ram Charan Movie

గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో చెర్రీ నటించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్‍లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూట్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌ షేర్ చేశారు.

ఈ చిత్రంలో తన పాత్ర కోసం మేకోవర్ చేస్తున్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్‌సీ 16 కోసం మంచి పని పెట్టాడు..గెటప్‌ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది'అని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీ16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని  రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతమందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


 

 

Advertisement
 
Advertisement
Advertisement