రామ్‌చరణ్- బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ‘చికిరి చికిరి..’ (Chikiri Chikiri Song)అంటూ సాగే ఈ పాటకు చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌ను బాలాజీ రచించారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. అలంకరణ అవసరంలేని ఆడపిల్లల్ని ముద్దుగా తమ గ్రామంలో చికిరి అని పిలుస్తారని దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


