రామ్ చరణ్‌కు గాయం.. పెద్ది టీమ్ క్లారిటీ | Peddi Movie Clarity On Ram Charan Injury On Shooting Sets | Sakshi
Sakshi News home page

Peddi Movie: రామ్ చరణ్‌కు గాయం.. పెద్ది టీమ్ క్లారిటీ

Mar 25 2026 7:05 PM | Updated on Mar 25 2026 7:15 PM

Peddi Movie Clarity On Ram Charan Injury On Shooting Sets

మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ గాయంపై పెద్ది టీమ్ స్పందించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. షూటింగ్‌లో చరణ్‌ ఎడమకన్నుకు చిన్న గాయమైందని వెల్లడించింది. అనంతరం రామ్ చరణ్‌కు చికిత్స అందించామని ప్రకటించింది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ ప్రారంభమవుతుందని పెద్ది టీమ్ నోట్ విడుదల చేసింది. దయచేసి ఎటువంటి ఊహాగానాలు నమ్మవద్దని అభిమానులకు సూచించింది. పెద్ది షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ఈ మూవీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement