‘చికిరి చికిరి... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...’ అంటూ రామ్ చరణ్ క్లాసిక్ స్టెప్పులేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ విషయంలో చాలామందిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. సోషల్‌మీడియాలో పెద్ద చర్చగా సాగుతుంది. చికిరి అంటూ చరణ్ వేసిన స్టెప్పులు చాలా యూనిక్‌గా ఉన్నాయని అభిమానులు చెబుతున్నప్పటికీ వారిలో కూడా ఇదే ప్రశ్న తలెత్తుతుంది.
పెద్ది సినిమా నుంచి శుక్రవారం తొలి పాటని విడుదల చేశారు. చికిరి చికిరి... అంటూ సాగే ఈ పాటని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ సాహిత్యం అందించారు. సాంగ్ బాగుందని ప్రశంసలు కూడా వస్తున్నాయి. యూట్యూబ్‌లో అన్ని భాషలలో కలిపి 50 మిలియన్ల వ్యూస్‌కు చేరుకుంది. అయితే, అందరి మనస్సులలో ఒక ప్రశ్న ఉంది. ఈ పాటను తెలుగు, హిందీ, కన్నడ , మలయాళంలో విడుదల చేశారు. కానీ, తమిళ వెర్షన్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే, దానికి కారణం మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.
తమిళ ప్రేక్షకులు కూడా ఈ విషయంపై ట్వీట్లు చేస్తున్నారు. చరణ్, A.R. రెహమాన్ అభిమానులు కూడా సాంగ్ గురించి అప్‌డేట్ ఇవ్వమని కోరుతున్నారు. ప్రస్తుతానికి, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎటువంటి సమాచారం పంచుకోలేదు. అయితే, కొంతమంది A.R. రెహమాన్ తన హైదరాబాద్ కచేరీలో తమిళ వెర్షన్‌ను ప్రత్యక్షంగా పాడవచ్చని ఊహిస్తున్నారు. చికిరి చికిరి తమిళ వెర్షన్‌ను మేకర్స్ ఎలా మార్కెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


