చరణ్ డాన్స్‌తో వాటి అందం రెట్టింపు అయింది: ఏఆర్ రెహమాన్ | Peddi Movie: Songs beauty doubled with Ram Charan dance says AR Rahman | Sakshi
Sakshi News home page

చరణ్ డాన్స్‌తో వాటి అందం రెట్టింపు అయింది: ఏఆర్ రెహమాన్

May 23 2026 11:37 PM | Updated on May 24 2026 5:26 AM

Peddi Movie: Songs beauty doubled with Ram Charan dance says AR Rahman

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. మొదట విడుదలైన “చికిరి.. చికిరి” పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. “రయ్.. రయ్.. రారా” పాట కూడా భారీ హిట్ అయింది. తాజాగా విడుదలైన స్పెషల్ మాస్ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.  

అయితే ఈ పాటల్లో ఏదీ తన ఫేవరెట్‌ సాంగ్‌ కాదని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం ప్రకారం, తనకు అత్యంత ఇష్టమైనవి ఈ చిత్రంలోని ఇంకా విడుదల కాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోని సాంగ్స్ అని తెలిపారు. ఈ సినిమాలో కీలకమైన రెండు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయట. వాటిలో ఒకటి అత్యంత ఎమోషనల్‌గా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు కూడా ఓ ఇంటర్వూలో ధృవీకరించారు.

రామ్‌చరణ్ గురించి రెహమాన్ మాట్లాడుతూ.. నేను పాటలు కంపోజ్ చేసినప్పుడు అవి బాగానే ఉన్నాయి. కానీ ఆ పాటలకు చరణ్ డాన్స్ చేసిన తర్వాత వాటి అందం రెట్టింపు అయింది. రీ-రికార్డింగ్ సమయంలో చరణ్‌ పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. సినిమాలో బెస్ట్ పార్ట్ చరణ్‌ యాక్టింగ్‌ అని అన్నారు. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంచి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement