పెద్ది వాయిదా తప్పదా.. అందుకే ఆ డేట్ మార్చారా? | Ram Charan's Latest Movie Peddi Postponed Again Goes Viral In Tollywood | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది వాయిదా తప్పదా.. అందుకే ఆ డేట్ మార్చారా?

Mar 26 2026 4:11 PM | Updated on Mar 26 2026 4:44 PM

Ram Charan's Latest Movie Peddi Postponed Again Goes Viral In Tollywood

రామ్ చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్‌ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. ఈ రోజు నుంచి యథావిధిగా పెద్ది షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇప్పటికే ఓసారి వాయిదా పడిన పెద్ది మూవీపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌పోన్ కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈనెల 27 నుంచి ఓవర్‌సీస్‌ బుకింగ్స్‌ ఓపెన్ చేస్తామని ముందుగానే ప్రకటించారు. కానీ ఈ డేట్‌ కూడా ఏప్రిల్ 8కి మార్చారు. దీంతో మరోసారి పెద్ది వాయిదా పడనుందనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

తాజా ‍అప్‌డేట్‌ ప్రకారం చూస్తే.. ఈ మూవీ షూటింగ్‌ ఇంకా జరుగుతూ ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల వల్ల మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా బుచ్చిబాబు ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనుకున్న సమయానికి ‍అన్ని పనులు పూర్తయితే చెప్పిన డేట్ ప్రకారమే పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే మే 21వ తేదీకి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. మరోవైపు శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement