రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ ఫైనల్ కాపీని రెడీ చేస్తున్నారు. తాజాగా పెద్ది ఫైనల్ కాపీ కూడా పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఎడిటింగ్ పూర్తి కావడంతో ఎడిటర్‌తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు దిగిన ఫోటోను షేర్ చేశారు.
పెద్ది ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. జూన్ 3న సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలోని ప్రత్యేక సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే.
The #PEDDI Edit has been locked🔒
All set and ready for massive premieres from JUNE 3rd 2026💥💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON June 4th ❤🔥#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/e240haEItl— Vriddhi Cinemas (@vriddhicinemas) May 7, 2026


