తిలక్ వర్మకు గిఫ్ట్‌ ఇచ్చిన రామ్ చరణ్.. అదేంటంటే? | Team India Cricketer Tilak Varma Visits Ram Charan Peddi Movie Sets | Sakshi
Sakshi News home page

Peddi Movie: తిలక్ వర్మకు గిఫ్ట్‌ ఇచ్చిన రామ్ చరణ్.. అదేంటంటే?

Mar 18 2026 5:16 PM | Updated on Mar 18 2026 5:29 PM

Team India Cricketer Tilak Varma Visits Ram Charan Peddi Movie Sets

రామ్‌ చరణ్‌ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి, రైరై రారా అంటూ సాంగ్స్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది.

తాజాగా పెద్ది మూవీ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. మూవీ షూటింగ్‌ సెట్స్‌కు వెళ్లిన తిలక్ వర్మ.. రామ్ చరణ్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తిలక్‌ వర్మకు రామ్ చరణ్ ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. పెద్ది మూవీ షూట్‌లో వాడిన పాత బ్యాట్‌ను తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. అంతేకాకుండా వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పెద్ది మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement