పెద్ది మూవీ కథపై డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో మేము చెప్పాలనుకున్న ఉదేశం అదేనని వెల్లడించారు. చిరంజీవితో చిట్ చాట్ సందర్భంగా పెద్ది కథ చెప్పడం వెనక ఉన్న ఉద్దేశమేంటో తెలిపారు. ఈ జనరేషన్‌కు ఆదర్శంగా నిలవాలనే ఈ కథ చేశానని బుచ్చిబాబు చెప్పారు. పిల్లలకు స్కూల్లో కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు.. వెనక గ్రౌండ్ కూడా ఉండాలన్నదే నా ఉద్దేశమన్నారు.
దీనిపై మెగాస్టార్ కూడా మాట్లాడారు. కార్పొరేట్ విద్యావ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మార్కులు, మార్కులు అంటున్నారని చిరంజీవి అన్నారు. ఈ రోజుల్లో పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోయాయన్నారు. ఇక నుంచైనా పిల్లలకు క్రీడల కోసం సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రామీణ ఆటగాళ్లను బయటకు తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. పెద్ది సినిమాలో ఇదే మెసేజ్ ఇచ్చారని.. ఈ విషయంలో నాకు చాలా సంతృప్తిగా ఉందని చిరు తెలిపారు.


