స్టార్ హీరో పాదాలకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్‌! | Tollywood Director Buchi Babu Sana Touches Star Hero Feet Goes Viral | Sakshi
Sakshi News home page

Buchi Babu Sana: స్టార్ హీరో కాళ్లు మొక్కిన టాలీవుడ్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు!

Published Mon, Jun 17 2024 3:50 PM | Last Updated on Mon, Jun 17 2024 9:36 PM

Tollywood Director Buchi Babu Sana Touches Star Hero Feet Goes Viral

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్‌లోనూ మహారాజా చిత్రానికి ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి హైదరాబాద్‌లో పర్యటించారు. ఓ హోటల్‌ జరిగిన ఈవెంట్‌లో విజయ్, టాలీవుడ్ డైరెక్టర్‌ బుచ్చిబాబు సనా పాల్గొన్నారు. విజయ్ సేతుపతి ఈ కార్యక్రమానికి వస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉప్పెన మూవీలో కలిసి పనిచేసిన బుచ్చిబాబు ఏకంగా విజయ్ సేతుపతి కాళ్లకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. బుచ్చిబాబు తదుపరి చిత్రం రామ్ చరణ్‌తో కలిసి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవర భామ జాన్వీ కపూర్  హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్‌ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement