‘పెద్ది’ ట్రైలర్‌కు యావరేజ్‌ టాక్‌, కారణం ఇదే : బుచ్చిబాబు | Buchi Babu Respond About Peddi Trailer Talk | Sakshi
Sakshi News home page

‘పెద్ది’ ట్రైలర్‌కు యావరేజ్‌ టాక్‌.. బుచ్చిబాబు ఏమన్నారంటే..

Jun 2 2026 6:49 PM | Updated on Jun 2 2026 7:56 PM

Buchi Babu Respond About Peddi Trailer Talk

పెద్ది సినిమా అనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచి అంచనాలు పెంచుతూనే ఉంది. రామ్‌ చరణ్‌ లుక్‌ రిలీజ్‌, గ్లింప్స్‌తో పాటు పాటలు కూడా ఆ అంచనాలు భారీగా పెంచాయి. అయితే ట్రైలర్‌ మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సోషల్‌ మీడియాలో ఈ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో బుచ్చిబాబు దగ్గర ప్రస్తావించాడు ఓ విలేకరి. దానికి బుచ్చిబాబు తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు.

‘కథను ఎక్కువగా చెబితే అసలు విషయం తెలిసిపోతుంది. అందుకే ట్రైలర్‌ని అలా కట్‌ చేశాం. అసలు కంటెంట్‌ని తీసుకోలేదు కాబట్టి.. ట్రైలర్‌లో చెప్పాల్సినంత చెప్పలేకపోయాం. అయితే ఒకప్పుడు ఘన విజయం సాధించిన చిత్రాల ట్రైలర్లన్నీ యావరేజ్‌ టాకే సంపాదించుకున్నాయి(నవ్వుతూ..). ఈ లెక్కన పెద్ది కూడా సరైన దారిలోనే వెళ్తుందేమో అనిపిస్తుంది’ అని బుచ్చిబాబు అన్నారు. 

ఇక రిలీజ్‌ దగ్గరపడుతున్నకొద్ది తనకు టెన్షన్‌ ఎక్కువైపోయిందన్నారు. మరికొన్ని గంటల్లో(జూన్‌ 4) ప్రేక్షకుల ముందుకు రానుందని, హిట్‌ టాక్‌ వస్తే హ్యాపీగా ఫీలవుతానని బుచ్చిబాబు చెప్పారు. ఇక తన కొత్త సినిమాల గురించి చెబుతూ..అల్రెడీ ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకున్నానని చెప్పారు. మూడో సినిమా ఎన్టీఆర్‌తోనే చేస్తారా అని అడగ్గా.. ‘ఆయన టైమ్‌ ఇవ్వాలనే కానీ క్షణాల్లో వెళ్లి కథ చెబుతా’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement