మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. దీంతో కాస్తా ముందుగానే పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పెద్దిని ఎట్టకేలకు జూన్ 4న బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.


