రామ్ చరణ్ పెద్ది రిలీజ్‌.. భారీ రికార్డ్‌కు మేకర్స్‌ ప్లాన్..! | peddi makers planning for to create Record In premiere shows | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది రిలీజ్‌.. ఆ విషయంలో భారీ రికార్డ్‌కు ప్లాన్..!

Apr 26 2026 6:50 PM | Updated on Apr 26 2026 6:56 PM

peddi makers planning for to create Record In premiere shows

రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లోనే షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయనుంది.

అయితే పెద్ది మూవీ జూన్‌లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియాలో టాక్‌ నడుస్తోంది. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతలోనే పెద్ది ప్రీమియర్స్‌కు సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమా ప్రీమియర్స్ విషయంలో కొత్త రికార్డ్ సెట్ చేయనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  జూన్ 24 న సాయంత్రం ఆరు గంటల నుంచే పెద్దఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రామ్‌చరణ్ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్‌ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్‌ తెప్పిస్తాయని అంటున్నారు. దీంతో పెద్ది మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే పెద్ది రిలీజ్‌ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement