
సినిమా, నాటకం, బుల్లితెర, సంగీతం వంటి కళారంగాల్లో విశిష్ట సేవలు అందించిన కళాకారులకు మూడేళ్లకు గాను కలైమామణి అవార్డు(kalaimamani award)లను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఈ అవార్డులు ప్రకటించ లేదు. ఎట్టకేలకు 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి కలైమామణి అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేసిన గత నెల ప్రకటించారు.
అలాగే, తమిళ మహాకవి భారతియార్, గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, బాలసరస్వతిల పేరిట అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే 2021కిగాను నటనా విభాగంలో ప్రముఖ సినీనటి సాయిపల్లవి(Sai Pallavi) ఎంపిక అయ్యారు. సీఎం స్టాలిన్ చేతులమీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. మూడేళ్లకు గాను మొత్తం 90 మందికి పురస్కారాలు అందజేశారు. సంగీత దర్శకులు అనిరుధ్ రవిచందర్‌తో పాటు సినీ నటులు, దర్శకుడు ఎస్‌జే సూర్య, విక్రమ్ ప్రభు వంటి ప్రముఖులు కూడా అవార్డులు అందుకున్నారు.