
రోషన్ (Roshan Kanakala) హీరోగా నటిస్తున్న చిత్రం 'మోగ్లీ' (Mowgli).. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. రాజీవ్ కనకాల- సుమ వారసుడిగా చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన రోషన్ 'మోగ్లీ' ప్రేమకథతో వస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్ నాని వాయిస్‌తో మొదలౌతుంది. 25 సంవత్సరాలు నిండని ఓ కుర్రాడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడంటూ నాని వాయిస్‌తో డైలాగ్ ప్రారంభమౌతుంది. వాడు గ్యాంగ్ స్టర్ కాదు, క్రిమినల్ కాదంటూనే వాడి కథేంటో తెలుసుకోవాలంటే మోగ్లీ చూడాలని చెప్పాడు. ఇందులో హీరోయిన్‌గా సాక్షి సాగర్ నటించారు. కలర్‌ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.