'మగాడిగా పుట్టడమే పెద్ద దరిద్రం రా'.. మోగ్లీ టీజర్ అదుర్స్ | Roshan Kanakala latest movie Mowgli 2025 teaser out now | Sakshi
Sakshi News home page

Mowgli Teaser: 'మగాడిగా పుట్టడమే పెద్ద దరిద్రం రా'.. మోగ్లీ టీజర్ అదుర్స్

Nov 12 2025 5:02 PM | Updated on Nov 12 2025 5:16 PM

Roshan Kanakala latest movie Mowgli 2025 teaser out now

యాంకర్ సుమ కుమారుడు రోషన్‌ కనకాల హీరోగా వస్తోన్న తాజా చిత్రం మోగ్లీ 2025(Mowgli Teaser). ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. బబుల్‌ గమ్‌ మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ఈ సినిమాతో హిట్‌ కొట్టేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాక్షి సాగర్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ టీజర్‌ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఈ కథ అంతా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో సన్నివేశాలు, డైలాగ్స్‌ చూస్తే ఈ కథేంటో ప్రేక్షకులకు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన డిసెంబరు 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి కాలభైరవ సంగీతమందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement