సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్‌ వచ్చేసింది | Roshan kanakala Mowgli 2025 First Lyrical Song Sayyare Out Now | Sakshi
Sakshi News home page

Mowgli 2025: సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్‌ వచ్చేసింది

Oct 24 2025 4:32 PM | Updated on Oct 24 2025 4:33 PM

Roshan kanakala Mowgli 2025 First Lyrical Song Sayyare Out Now

యాంకర్ సుమ తనయుడు రోషన్‌ (Roshan Kanakala) హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'మోగ్లీ' (Mowgli). ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. బబుల్‌గమ్‌ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ప్రస్తుతం సందీప్‌ రాజ్‌తో జతకట్టారు. ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

తాజాగా ఈ మూవీ నుంచి లవ్‌ అండ్ రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సయ్యారే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాల భైరవ, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగే  రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాగా.. మోగ్లీ  డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement