
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 17న ఈ చిత్రం విడుదల కానుంది. కొద్దిరోజులుగా ప్రదీప్ రంగనాథన్ పేరు టాలీవుడ్‌లో వైరల్ అవుతుంది. ఆయన తండ్రి చేస్తున్న పని గురించి కొందరు చర్చించుకుంటే.. మరికొందరు మాత్రం అతనిపై ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. 'మీరు హీరో మెటీరియల్‌లా లేరు.. కానీ, రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు' అంటూ ఒక జర్నలిస్ట్ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు కూడా ప్రదీప్‌కు మద్ధతుగా నిలిచారు. జర్నలిస్ట్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రీసెంట్‌గా కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ సదరు జర్నలిస్ట్‌ను కోరారు.
వెండితెరపై ప్రదీప్ రంగనాథ్ ఒక సాధారణ యువకుడిలా కనిపించడమే కాదు నిజ జీవితంలో కూడా అంతేనని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు సరైన ఛాన్స్ కోసం ఆయన కష్టపడ్డారు. ఫైనల్‌గా విజయం సాధించారు. డబ్బు, పేరు అన్నీ ప్రదీప్‌కు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఆయన కుటుంబం సాధారణ జీవితమే గడుపుతుంది. ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ పంచుకున్నారు.
నా తండ్రి చెన్నైలో సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఒక జిరాక్స్ షాపు నడుపుతూనే మా కుటుంబాన్ని నాన్న పోషించారు. నాకు సినిమా ఛాన్సులతో పాటు పేరు, డబ్బు వచ్చింది. అయినప్పటికీ నాన్న మాత్రం జిరాక్స్ షాప్ నడుపుతూనే ఉన్నారు. ఎప్పటికీ మన మూలాలను మరిచిపోవద్దని ఆయన చెబుతుంటారు. రోజూ ఉదయాన్నే బస్సులోనే షాప్‌కు వెళ్తారు.. ఒక కారు కొనిస్తానని చెప్పినా సరే దానిని తిరస్కరించారు. ఇప్పటికీ బస్సులోనే ఆయన ప్రయాణం చేస్తారు. సింపుల్‌గా ఉండటమే నాన్నకు ఇష్టం.' అని ప్రదీప్ చెప్పారు.
ప్రదీప్ రంగనాథ్ తన కాలేజీ రోజుల గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులతో పాస్ అయ్యానని చెప్పారు. కానీ, తనకు ఎక్కువ సినిమాలంటే పిచ్చి అని కూడా తెలిపారు. దీంతో తన తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందే వారని గుర్తుచేసుకున్నారు. అయితే, చదువును అశ్రద్ధ చేయనని వారికి చెప్పాను. జయం రవితో కొమలి సినిమాను డైరెక్ట్ చేసిన తర్వాత పరిశ్రమలో ఫేమ్ దక్కిందన్నారు. ఆ తర్వాత లవ్ టుడేతో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. ప్రదీప్ డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.
Reacting to the "Hero Material" Controversy, #KiranAbbavaram asks the media personnel to ask him anything but be gentle about the likes of #PradeepRanganathan terming him as our Guest from Other State! pic.twitter.com/xdQ3dATvTi
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 11, 2025