సుమ తనయుడి కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్‌ పోస్టర్ చూశారా? | Anchor Suma Son Roshan Kanakala Upcoming Film First Look Poster | Sakshi
Sakshi News home page

Roshan kanakala: సుమ తనయుడి కొత్త చిత్రం.. టైటిల్ ఏంటో తెలుసా?

Dec 19 2024 4:32 PM | Updated on Dec 19 2024 5:20 PM

Anchor Suma Son Roshan Kanakala Upcoming Film First Look Poster

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది బబుల్‌గమ్‌ మూవీతో టాలీవుడ్‌ హీరోగా అరంగేట్రం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

అయితే తాజాగా మరో చిత్రానికి రెడీ అయ్యారు రోషన్. కలర్‌ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్‌ డైరెక్షన్‌లో నటించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే రోషల్  వైల్డ్ లుక్‌ను తలపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ సాక్షిసాగర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement