
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను నవంబరు 14న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం మేకర్స్ ప్రకటించారు.
‘‘నేటి సమాజంలో యూత్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంలో వినోదాత్మకంగా రూ పొందిన సినిమా ఇది. ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్.