మోహన్‌ లాల్ పాన్ ఇండియా మూవీ రిలీజ్‌.. దీపావళికి కాదు! | Malayala Star Hero Mohan Lal Latest Movie Vrusshabha Release Date Announced With Poster Went Viral | Sakshi
Sakshi News home page

Vrusshabha Movie: మోహన్‌ లాల్ వృషభ.. కొత్త రిలీజ్‌ డేట్ వచ్చేసింది!

Oct 9 2025 3:54 PM | Updated on Oct 9 2025 5:00 PM

Malayala Star Hero Mohan lal latest Movie release date

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించడం విశేషం. ఈ పాన్ ఇండియా చిత్రంపై మోహన్ లాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  అయితే ఈ ఫుల్ యాక్షన్‌ మూవీ దీపావళికి రిలీజ్‌ కావాల్సి ఉంది. మొదట అక్టోబర్ 23 రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కానీ ఈ దీపావళికి థియేటర్లలో వృషభ రిలీజ్ కావడం లేదు. తాజాగా కొత్త రిలీజ్‌ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల అంటే నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని స్పెషల్ పో‍స్టర్‌ను పంచుకున్నారు. ఇ‍ప్పటికే రిలీజైన టీజర్‌ చూస్తుంటే మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్‌ బాహుబలి తరహాలో మోహన్ లాల్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మోహన్‌ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు.  ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్‌, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement