టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ సినీ ప్రియులకు దాదాపు పరిచయమే
షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు
'కలర్ ఫోటో' సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రాజ్
ప్రస్తుతం సందీప్ రాజ్ ఓ ఇంటివాడు కాబోతున్నారు
నటి చాందిని రావును ఆయన పెళ్లాడనున్నారు
తాజాగా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు
దీనికి సంబంధించిన ఫోటోలను సందీప్ రాజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు
సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని రావు నటించింది
అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది
ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు
వచ్చేనెల అంటే డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది


