కలర్‌ఫోటో మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్. ప్రస్తుతం మోగ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రంలో యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నటి చాందిని రావును ఆయన పెళ్లాడారు. డిసెంబరు 7న తిరుపతితో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి జరిగి సరిగ్గా నేటికి ఏడాది పూర్తయింది. మొదటి పెళ్లి రోజు కావడంతో డైరెక్టర్ సందీప్ రాజ్ తన భార్య చాందిని రావుకు విషెస్ తెలిపారు. హ్యాపీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ మై డియర్ క్యూట్‌నెస్.. చల్లగుండు బిడ్డ అంటూ సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు మ్యారేజ్ డే విషెస్ చెబుతున్నారు.
కాగా.. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ.. డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు.


