ముక్కుసూటి వైఖరితో ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉంటుంది నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar). తమిళనాడులోని అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగువారు వచ్చారని.. అందులో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలామణి అవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తన సినీ జీవితం, జైలు జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది
అపార్థం చేసుకున్నారు
కస్తూరి మాట్లాడుతూ.. 'నేను యాంకర్‌గా కెరీర్ ప్రారంభించాను. ఆ సమయంలో నాగార్జున షేక్‌హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఆయనతోనే అన్నమయ్య సినిమాలో నటించాను. అందుకు చాలా హ్యాపీ. గతేడాది నాకు అస్సలు కలిసిరాలేదు. ఓ రాజకీయ వేదికపై నేను చెప్పిన మాటల్ని ట్విస్ట్ చేసి వైరల్ చేశారు. నాపై నింద వేసి మరీ జైల్లో వేశారు. తెలుగు భాష అన్నా, ఇక్కడివారన్నా నా ఫ్యామిలీలాగా భావిస్తాను. ఆ అభిమానంతోనే ఇక్కడ సెటిలయ్యాను. అలాంటిది వీళ్లందరూ నన్ను అపార్థం చేసుకున్నారన్నదే నా పెద్ద బాధ!
బ్లడ్ క్యాన్సర్
సినిమాల్లో చూపించినట్లుగా జైలు జీవితం ఉండదు. జైలుకు వెళ్లిన రోజు నా జీవితంలోనే వరస్ట్. ఇకపోతే నా జీవితం అయిపోయింది అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా అమ్మ ఆరోగ్యం బాగుచేయాలని ఆరేళ్లు కష్టపడ్డాం. కానీ చనిపోయింది. అమ్మ పోయిన ఐదు నెలలకే నాన్న మరణించాడు. తర్వాత మా అమ్మాయిని చావు అంచుల నుంచి బయటకు తీసుకొచ్చాం. తనకు బ్లడ్ క్యాన్సర్.. ట్రీట్‌మెంట్ పని చేయలేదు. ప్రపంచంలో 200 మందికి మాత్రమే వచ్చే అరుదైన బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తనను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అదే నాకు పెద్ద పరీక్ష, బాధ! నా కూతురి పేరిట మను మిషన్ అని ఓ స్వచ్చంద సంస్థను ప్రారంభించాను.

రైల్వే ట్రాక్‌పై పసిబిడ్డ దొరికింది
ఈ చారిటీ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఏదైనా బహుమతులు, దుస్తులు ఇవ్వడం లాంటి చిన్నచిన్న పనులు చేస్తుంటాం. అలా చేస్తుండగా ఓసారి రైల్వే ట్రాక్‌పై ఓ పసిబిడ్డను చూశాను. తనకు రెండేళ్లు.. కానీ చూసేందుకు ఐదు నెలల పిల్లాడిలా ఉంటాడు. రోడ్లపై అడుక్కోవడం కోసం ఆ చిన్నారిని ఎదగనివ్వలేదు. నోట్లో సారా పోసి పడుకోబెట్టేవారు. ఆ బిడ్డను అవసరమైనంతవరకు వాడుకుని తర్వాత రైల్వే ట్రాక్‌పై పడేశారు. ఆ బాబును ఆస్పత్రికి తీసుకెళ్తే కాలేయం పూర్తిగా పాడైందన్నారు.
చావును ప్రసాదించమన్నా..
మానసిక ఎదుగుదల లేదని చెప్పారు. వారంపాటు నేన ట్రీట్‌మెంట్ చేయించాను. ఏమాత్రం బెటర్‌మెంట్ లేకపోయేసరికి నేను ధైర్యం తెచ్చుకుని ఓ మాట అడిగాను. తనకు ఎదుగుదల లేనప్పుడు వైద్యం చేయించి ఇంకా నరకంలోకి తోయడం ఎందుకు? తనను మెర్సీ కిల్లింగ్(చావు ప్రసాదించడం)కి వదిలేయొచ్చుగా అని అడిగాను. అందుకు డాక్టర్.. అలా చావాలని రాసుంటే ఆకలిదప్పికలతో ఎప్పుడో చచ్చిపోయేవాడు. బతికున్నాడంటే అతడొక ఫైటర్.
నాపై ఉమ్మేశారు
తనను బతికించడం మా బాధ్యత అన్నారు. ప్రస్తుతానికైతే బాబు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చావును మనం నిర్ణయించకూడదు. బతకడం మాత్రమే మన కర్తవ్యం అని చెప్పుకొచ్చిందిది. తనకు ఎదురైన ఓ చెత్త అనుభవం గురించి చెప్తూ.. ఓసారి దగ్గర్లో ఉన్న ఏటీఎమ్ కోసం నడుచుకుంటూ వెళ్లాను. ఇంతలో ఓ బస్సులో నుంచి ఒకరు నా మీద ఉమ్మేశారు అని తెలిపింది.
చదవండి: 'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్ వీడియోలు బయటపెట్టమంటావా?'


