
అడల్ట్ సినిమాలపై నటి చార్మిళ వ్యాఖ్యలు..
ఇంటర్నెట్ పుణ్యమా అని అడల్ట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఒకప్పుడు అంటే షుమారుగా 3 దశాబ్ధాల క్రితం ఈ పరిస్థితి లేదు. పెద్దలకు మాత్రమే అంటూ ఊరించే ఎ సర్టిఫికెట్ సినిమాల కోసం సదరు అడల్ట్ మూవీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. అలాంటి వారందరికీ ఆంగ్ల చిత్రాల తర్వాత మన దేశీయ భాషలో ఒకే ఒక చిత్ర పరిశ్రమ నుంచి సాంత్వన లభించేది. అది...ప్రస్తుతం దేశంలోనే అత్యంత వైవిధ్య భరిత చిత్రాలకు కేరాఫ్‌గా ఉన్న మళయాల చిత్ర పరిశ్రమ. అదే ఒకప్పుడు బూతు చిత్రాలకు చిరునామాగా ఉండేది. అప్పట్లో షకీలా తదితర అడల్ట్ మూవీ స్టార్స్ మళయాళ సినిమాలపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించేవారు. దాంతో దేశవ్యాప్తంగా బి గ్రేడ్ సినిమాలంటే మళయాళమే అనే గుర్తింపు వచ్చేసింది. బహుశా ఇప్పటి తరానికి పెద్దగా తెలియని ఆనాటి విషయాలను గుర్తుకు వచ్చేలా చేసింది తమిళ సినీనటి ఛార్మిల(Charmila)
మలయాళ సినిమాలో ఒకప్పుడు ప్రముఖ తారగా వెలుగొందింది నటి చార్మిల, ఆ పరిశ్రమలో చేరడానికి ముందు తనకు ఆ పరిశ్రమ పట్ల ఉన్న అభిప్రాయం గురించి వెల్లడించింది, గతంలో అంటే 1980– 1990 మధ్య కాలంలో మళయాళ చిత్రపరిశ్రమ ఖ్యాతి బి–గ్రేడ్ చిత్రాలవెల్లువలో కొట్టుకుపోయిందని చెప్పిందామె. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో మలయాళ సినిమా ఆఫర్‌లను అంగీకరించకుండా తన తల్లిదండ్రులు అడ్డుకున్నారని గుర్తుచేసుకుంది. ‘‘అప్పట్లో, మలయాళ సినిమా అంటే కేవలం బి–గ్రేడ్ చిత్రాలను మాత్రమే నిర్మిస్తుందని చాలా మంది భావించేవారు, అందుకే నా తల్లిదండ్రులు ఆ పరిశ్రమకు నన్ను పంపడానికి ఇష్టపడలేదు, అందుకే మొదటి ఆఫర్ వచ్చినప్పుడు భయపడ్డా. పేరొందిన దర్శకులు సంప్రదించినప్పుడు కూడా నటించడానికి నిరాకరించాను’’ అంటూ వెల్లడించారామె.
కేరళ లోపల కాకుండా ఆ రాష్ట్రం బయట థియేటర్లలో నడిచిన మళయాళ సినిమాల వల్లనే మళయాళ చిత్ర పరిశ్రమకు ఈ రకమైన కళంకం అంటిందని ఆమె అభిప్రాయపడింది. పక్కరాష్ట్రాల్లోని జనం మలయాళ చిత్రాల గురించి మాట్లాడినప్పుడు, వారికి గుర్తుకు వచ్చేది ఎ–సర్టిఫికేట్ సినిమాలు, వాటి పోస్టర్లు మాత్రమే. ‘వారికి మళయాళ వినోదం అంటే డ్రగ్స్ లేడీస్,‘ అంటూ చెప్పిందామె. సీనియర్ నిర్మాత కె బాలాజీ తన కుటుంబాన్ని ఒప్పించిన తర్వాతే బాలాజీ అల్లుడు నేటి సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో తాను నటించానంది. మలయాళ సినిమా అంతా బి–గ్రేడ్ టైప్ కాదని, మోహన్ లాల్ మమ్ముట్టి వంటి ప్రధాన నటులు మంచి చిత్రాలలో మాత్రమే పనిచేస్తారని ఆయన అర్ధం అయేలా చెప్పడంతో చార్మిల తన తొలి మలయాళ ప్రాజెక్ట్‌లో మోహన్ లాల్ సరసన నటించింది, తరువాత క్లాసిక్‌ల ద్వారా ఆ భాషలో కెరీర్‌కు బాటలు వేసుకుంది.
ఆ కాలపు మళయాళ చిత్ర పరిశ్రమ గురించి గుర్తు చేసుకుంటూ ‘‘ బి–గ్రేడ్ సినిమాలో పనిచేసిన నటులు ‘పూర్తిగా భిన్నమైన వర్గానికి‘ చెందినవారని వారు బస చేసిన హోటళ్ళు మా హోటళ్ళలా ఉండేవి కావు‘ అని ఆమె చెప్పింది, తరువాత వారిలో చాలామంది సినిమాలను విడిచిపెట్టారని, కొందరు వివాహం తర్వాత విదేశాలకు వెళ్లారని లేదా ఇతర భాషలలో గ్లామర్ పాత్రలకు మారారని ఆమె చెప్పింది.
ఆ సమయంలో మలయాళ సినిమా చుట్టూ వివాదాలు ఎలా ఉన్నా చార్మిల సినిమాలు స్వర్ణ యుగంలో భాగంగా పరిగణన పొందాయి. ఆమె తమిళనాడులో జన్మించినప్పటికీ, ’ధనం’లో గ్రామీణ అమ్మాయి థంకమ్ పాత్రలో తన నటనతో మలయాళ ప్రేక్షకుల హదయాలను గెలుచుకుంది. తరువాత ఆమె ’అంకుల్ బన్ ’, ’కేళి’, ’ప్రియపెట్ట కుక్కు’ మోహన్ లాల్, జయరామ్, వినీత్ వంటి తారలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో పనిచేస్తోంది. అయినప్పటికీ ఆమె అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలు మాత్రం ఆమె మలయాళ విహారయాత్రలుగా మిగిలిపోయాయి. నటుడు బాబు ఆంటోనీ ఆ తరువాత విడాకులు తీసుకున్న నటుడు హోస్ట్ కిషోర్ సత్యతో ఆమె గత సంబంధాలు సహా ఆమె వ్యక్తిగత జీవితం ఆమె స్క్రీన్ కెరీర్ లాగే అందరి దృష్టినీ ఆకర్షించింది.