క్యాస్టింగ్ కౌచ్ అనే పదం బయటి వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్లకు తరచుగా ఈ పదం వినిపిస్తూనే ఉంటోంది. ఏదో ఒక సందర్భంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఎదుర్కొని ఉంటారు. కొందరు ఈ విషయాన్ని బయటకు చెబుతుంటారు. మరికొందరేమో సమాజానికి భయపడి తమలోనే దాచుకుంటారు. ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న ప్రముఖ బుల్లితెర నటి ఓపెన్ అయింది.
తన కెరీర్‌లో ఎదురైన క్యౌస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. కోలీవుడ్ బుల్లితెర నటి మాన్య ఆనంద్ తమిళంలో సుపరిచితమైన పేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తనను కమిట్‌మెంట్ అడిగారని షాకింగ్ కామెట్స్ చేసింది. హీరో ధనుశ్ మేనేజర్ శ్రేయాస్ కొత్త సినిమా కోసం తనను సంప్రదించారని తెలిపింది. ఈ మూవీ కోసం మీరు కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగారని క్యౌస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంది. అయితే తాను వెంటనే రిజెక్ట్ చేసి వెనక్కి వచ్చేశానని పేర్కొంది. అయినప్పటికీ తనకు ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్ వివరాలు, స్క్రిప్ట్ పంపాడని వెల్లడించింది. తాను నో చెప్పినా శ్రేయాస్ తనను చాలాసార్లు సంప్రదించాడని మాన్య ఆనంద్ తెలిపింది.
అంతేకాకుండా మరో మేనేజర్ కూడా ఇదే సినిమా కోసం ఇలాంటి అభ్యర్థనతో తనను సంప్రదించాడని నటి పేర్కొంది. కాగా.. వనతై పోలా అనే తమిళ టీవీ సీరియల్‌లో మాన్య ఆనంద్ నటించింది. తాజాగా మాన్య చేసిన కామెంట్స్‌పై శ్రేయాస్ కానీ, ధనుష్ టీమ్ నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.


