ప్రముఖ నటి, గాయని సులక్షణా పండిట్ (71) (Sulakshana Pandit) గురువారం (నవంబర్ 6) అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. . దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతున్న గాయని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మనోహరమైన గాత్రం, చిరస్మరణీయ నటనకు పేరుగాంచిన ప్రముఖ గాయని మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
యాదృచ్ఛికంగా దివంగత నటుడు, తాను ఎంతో ప్రేమించిన సంజీవ్‌కుమార్ వర్ధంతి రోజే 40 ఏళ్లకు ఆమె ఈ లోకంనుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది.
సులక్షణ పండిట్ -సంజీవ్ కుమార్ ప్రేమ
1975లో వచ్చిన ఉల్జాన్ సినిమాలో సులక్షణ పండిట్ ,సంజీవ్ కుమార్ కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్ లో ఆమె అతనితో ప్రేమలోపడింది. పెళ్లి చేసుకోవాలని భావించి, పెళ్లి ప్రపోజ్ చేసింది కూడా. అయితే దీర్ఘకాలిక గుండె జబ్బుతో బాధపడుతున్న తాను ఎక్కువ కాలం అనేభావనతో ఆమె ప్రేమను సున్నితంగా తిరస్కరించారట. 1985, నవంబర్ 6న సంజీవ్ కుమార్ మరణించాడు. అయితే సంజీవ్ కుమార్ మరణం తర్వాత తాను మానసికంగా కలత చెందాను, కుంగిపోయాను, చాలా కృంగిపోయానని ఒక సందర్భంలో స్వయంగా చెప్పారు సులక్షణ పండిట్ .

అటు సినిమా ఆఫర్లు, పాడు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఆమె తల్లి మరణం సులక్షణ పండిట్‌ను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా దెబ్బతీసింది. ఆమె స్టార్‌డమ్ నుండి క్రమంగా దూరమైంది. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు, పేదరికంతో బాధపడింది. అనుభవించింది. సోదరి, నటుడు విజయత పండిట్ , ఆమె భర్త, సంగీత స్వరకర్త ఆదేశ్ శ్రీవాస్తవతో కలిసి జీవించేది 2007లో తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి కూడా ప్రయత్నించింది.
సులక్షణ పండిట్,కొన్ని ఆసక్తికర సంగతులు
చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జూలై 12, 1954న జన్మించిన సులక్షణ పండిట్ సంగీతం కుటుంబం నుంచి వచ్చారు. ఆమె ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ మేనకోడలు , సంగీత స్వరకర్త ద్వయం జతిన్-లలిత్ సోదరి.
సులక్షణ తొమ్మిదేళ్ల వయసులోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. 1967లో తన నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసింది. సంకల్ప్ (1975)లోని ‘తు హి సాగర్ హై తు హి కినారా’ పాట ఏకంగా ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.
తక్దీర్ (1967) చిత్రం నుండి లతా మంగేష్కర్‌తో ఆమె యుగళగీతం ‘సాత్ సమందర్ పార్ సే’ మరో అద్భుతమైన గీతం.
నటిగా కూడా ఆమెది ప్రత్యేక స్థానమే. సంజీవ్ కుమార్ సరసన ఉల్జాన్ (1975) చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది. సంకోచ్ (1976), హేరా ఫేరి, అప్నాపన్, ఖండాన్ మరియు వక్త్ కి దీవార్ వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు రాజేష్ ఖన్నా, జీతేంద్ర, వినోద్ ఖన్నా, శశి కపూర్ , శత్రుఘ్న సిన్హాతో నటించి ప్రశంసలందుకుంది.
చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : చిన్మయి ఫైర్


