14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్ | Nidhi Agarwal Drunk Alcohol at age 14 | Sakshi
Sakshi News home page

14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్

Jan 21 2026 12:16 AM | Updated on Jan 21 2026 12:16 AM

Nidhi Agarwal Drunk Alcohol at age 14

సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల వెల్లడించింది. చిన్న వయసులోనే మద్యం సేవించడం ప్రారంభించినప్పటికీ, ఆ అలవాటును పూర్తిగా విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. 

నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను 14 ఏళ్ల వయసులోనే తొలిసారి మద్యం సేవించాను. ఆ సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి తాగడం సరదాగా అనిపించేది. అప్పట్లో అది ఫన్‌గా అనిపించింది. కానీ కాలక్రమేణా మద్యం నాకు సరిపడదని అర్థమైంది. తాగిన తర్వాత తనకు అసౌకర్యంగా, కొన్నిసార్లు భయంగా కూడా అనిపించేది.

ఆ అనుభవాలే నన్ను ఆలోచనలో పడేశాయి. చివరకు మద్యం పూర్తిగా మానేయాలనే నిర్ణయం తీసుకున్నాను. నేను చివరిసారి మద్యం తాగి దాదాపు ఆరేళ్లు పూర్తయింది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆలస్యంగా అయినా గ్రహించాను. నా శరీరం కూడా ఆల్కహాల్‌ను అంగీకరించడం లేదని అర్థమైంది. అందుకే వెంటనే మానేశాను.

ప్రస్తుతం పార్టీలకు వెళ్లినప్పటికీ మద్యం జోలికి మాత్రం వెళ్లడం లేదు. అయితే దాని బదులు గ్రీన్ టీతో ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది ఆల్కహాల్‌ తాగుతారు. కానీ నేను మాత్రం తాగను. మద్యం లేకుండానే పార్టీల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చని నిధి స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement