వన్డే సిరీస్‌కు అఫ్గనిస్తాన్‌ జట్టు ప్రకటన | ACB Announced Afghanistan squad for tri series Vs India A, Sri Lanka A | Sakshi
Sakshi News home page

వన్డే సిరీస్‌కు అఫ్గనిస్తాన్‌ జట్టు ప్రకటన

Jun 4 2026 1:49 PM | Updated on Jun 4 2026 7:31 PM

ACB Announced Afghanistan squad for tri series Vs India A, Sri Lanka A

ముక్కోణపు వన్డే సిరీస్‌కు అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) తమ జట్టును ప్రకటించింది. శ్రీలంక- ‘ఎ’, భారత్‌- ‘ఎ’ జట్లతో తలపడే అఫ్గన్‌- ‘ఎ’ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. ఈ జట్టుకు ఇమ్రాన్‌ మిర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఏసీబీ తెలిపింది.  

వికెట్‌ కీపర్ల కోటాలో నూర్‌ రహ్మాన్‌తో పాటు మొహమ్మద్‌ ఇషాక్‌లకు సెలక్టర్లు చోటిచ్చారు. బ్యాటింగ్‌ విభాగంలో హసన్‌ ఐసాఖిల్‌, ఖలీద్‌ తనీవాల్‌, ఐజాజ్‌ అహ్మద్‌జాయ్‌, బహీర్‌ షా మెహబూబ్‌, ఫైజల్‌ ఖాన్‌ షినోజదా స్థానం సంపాదించుకున్నారు.

ఆల్‌రౌండర్ల జాబితాలో ఫర్మానుల్లా సూఫీ, షామ్స్‌ ఉర్‌ రహ్మాన్‌ ఎంపికయ్యారు. వీరు సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు కాగా.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఖలీల్‌ గుర్బాజ్‌కు కూడా సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు.

ఇక స్పిన్‌ దళంలో రిస్ట్‌ స్పిన్నర్‌ జహీర్‌ ఖాన్‌ పక్టీన్‌ ఒక్కడే ఉండగా.. పేస్‌ విభాగంలో మహ్మద్‌ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌, ఫరీదూన్‌ దావూద్జాయ్‌ సేవలు అందించనున్నారు. 

కాగా జూన్‌ 9 నుంచి 21 వరకు శ్రీలంక వేదికగా ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత్‌-‘ఎ’ జట్టుకు హైదరాబాదీ తిలక్‌ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దంబుల్లా వేదికగా భారత్‌- శ్రీలంక- అఫ్గన్‌ ‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి.

శ్రీలంక- భారత్‌లతో ముక్కోణపు వన్డే సిరీస్‌కు అఫ్గన్‌-‘ఎ’ జట్టు ఇదే
ఇమ్రాన్‌ మిర్‌ (కెప్టెన్‌), నూర్‌ రహ్మాన్‌, మొహమ్మద్‌ ఇషాక్‌,  హసన్‌ ఐసాఖిల్‌, ఖలీద్‌ తనీవాల్‌, ఐజాజ్‌ అహ్మద్‌జాయ్‌, బహీర్‌ షా మెహబూబ్‌, ఫైజల్‌ ఖాన్‌ షినోజదా, ఫర్మానుల్లా సూఫీ, షామ్స్‌ ఉర్‌ రహ్మాన్‌, జహీర్‌ ఖాన్‌ పక్టీన్‌, ఫరీదూన్‌ దావూద్జాయ్‌, మహ్మద్‌ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌.

సిరీస్‌ షెడ్యూల్‌ ఇదే
జూన్‌ 9: భారత్‌ వర్సెస్‌ శ్రీలంక
జూన్‌ 11: భారత్‌ వర్సెస్‌ అఫ్గన్‌
జూన్‌ 13: అఫ్గన్‌ వర్సెస్‌ శ్రీలంక
జూన్‌ 15: భారత్‌ వర్సెస్‌ శ్రీలంక
జూన్‌ 17: భారత్‌ వర్సెస్‌ అఫ్గన్‌
జూన్‌ 19: అఫ్గన్‌ వర్సెస్‌ శ్రీలంక
జూన్‌ 12: ఫైనల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement