పుంజుకున్న టీమిండియా బౌలర్లు.. లంక బ్యాటర్లు కట్టడి | sri lanka A all out for 366 in second un official test vs india A | Sakshi
Sakshi News home page

పుంజుకున్న టీమిండియా బౌలర్లు.. లంక బ్యాటర్లు కట్టడి

Jul 3 2026 12:39 PM | Updated on Jul 3 2026 2:43 PM

sri lanka A all out for 366 in second un official test vs india A

శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో భారత బౌలర్లు పుంజుకున్నారు. తొలి రోజు పెద్ద ప్రభావం చూపని వీరు, రెండో రోజు లంక బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా ఆ జట్టు​ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక స్కోర్‌ 288-5గా ఉండింది. రెండో రోజు ఆట తొలి సెషన్‌లోనే గుర్నూర్‌ బ్రార్‌ (22-277-4), సరాన్ష్‌ జైన్‌ (30-2-92-4) చెలరేగడంతో ఆ జట్టు 61 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. 

83 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రెండో రోజు బరిలోకి దిగిన లంక కెప్టెన్‌ సహన్ అరచ్చిగే (127) సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గుర్నూర్‌ బ్రార్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ అంజల బండార (42) అదే స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. 

లంక ఇన్నింగ్స్‌లో పవంత వీరసింఘే 39, సోహన్‌ డి లివెరా 28, నువనిదు ఫెర్నాండో 44, అషేన్‌ బండార 34, చమిక​ గుణశేఖర 13, కేశర నువంత 1, దిలుమ్‌ సుదీర 20, అసంక మనోజ్‌ 4, దులజ్‌ సముదిత 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బ్రార్‌, సరాన్ష్‌ కాకుండా యశ్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement