భారత్‌- శ్రీలంక మ్యాచ్‌ డ్రా | India-A Set-312-Target For Sri Lanka-A Un-Official Test Match | Sakshi
Sakshi News home page

భారత్‌- శ్రీలంక మ్యాచ్‌ డ్రా

Jun 28 2026 2:59 PM | Updated on Jun 29 2026 10:37 AM

India-A Set-312-Target For Sri Lanka-A Un-Official Test Match

గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఇండియా-ఏ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 189 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో లంక-ఏ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్ (67) అర్ధసెంచరీ చేయగా, ఓపెనర్ ఆయుశ్ పాండే (38) పర్వాలేదనిపించాడు. 

లోయర్ ఆర్డర్‌లో షేక్ రషీద్ (20), హర్ష్ దూబే (29) పరుగులు చేయడంతో ఇండియా-ఏ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్ 172 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఇండియా-ఏ 311 పరుగులు సాధించింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక వర్షం అంతరాయం కలిగించే సమయానికి 6.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. 

నువానిదు ఫెర్నాండో (2), ఆషెన్ బండారా (1) క్రీజులో ఉన్నారు. ఇండియా-ఏ విజయానికి 8 వికెట్లు అవసరం కాగా.. లంక విజయానికి 275 పరుగులు చేయాల్సి ఉంది.  అంత‌క‌ముందు శ్రీలంక‌-ఏ తమ తొలి ఇన్నింగ్స్‌లో 330 ప‌రుగుల‌కు ఆలౌటైంది. నువానిదు ఫెర్నాండో (84), ఆషెన్ బండారా (70), కెప్టెన్ స‌హ‌న్ అరాచిగె (72) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. 

ఇండియా-ఏ బౌల‌ర్ల‌లో అకిబ్ న‌బీ 4 వికెట్లతో చెల‌రేగ‌గా, య‌ష్ ఠాకూర్‌, హ‌ర్ష్ దూబే చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ జ‌ట్టు 452 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన సంగ‌తి తెలిసిందే. ధ్రువ్ జురేల్‌తో పాటు ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ భారీ శ‌త‌కాల‌తో మెరిశారు.

UPDATE: మ్యాచ్‌ డ్రా
వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగగా.. మ్యాచ్‌ సాగే పరిస్థితి కనిపించలేదు. ఫలితంగా ఇరుజట్ల సారథులు డ్రాకు అంగీకరించారు. కాగా భారత్‌- శ్రీలంక మధ్య రెండో అనధికారిక టెస్టు జూలై 2న మొదలుకానుంది.

సంక్షిప్త స్కోర్లు
భారత్‌- 452/6d &189/8d
శ్రీలంక- 330 & 70/2.

Read: ఆసీస్‌తో 'డూ ఆర్‌ డై' మ్యాచ్‌.. మంధాన కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement