శ్రీలంకతో టెస్టు.. శతక్కొట్టిన భారత ఓపెనర్‌ | IND A vs SL A 1st Unofficial Test Galle: Sai Sudarsan Slams Hundred | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో టెస్టు.. శతక్కొట్టిన భారత ఓపెనర్‌

Jun 25 2026 2:06 PM | Updated on Jun 25 2026 3:44 PM

IND A vs SL A 1st Unofficial Test Galle: Sai Sudarsan Slams Hundred

సాయి సుదర్శన్‌ (PC: X)

శ్రీలంక- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత్‌- ‘ఎ’ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ శతక్కొట్టాడు. దిలుమ్‌ సుదీర బౌలింగ్‌లో సింగిల్‌ తీసి వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తొలుత బ్యాటింగ్‌ 
రెండు టెస్టు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌ ఆడేందుకు భారత్‌- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్‌ ధ్రువ్‌ జురెల్‌ ఈ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో ఓపెనర్లలో ఆయుశ్‌ పాండే (25) నామమాత్రపు స్కోరుకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (12) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

ఇక రుతురాజ్‌  గైక్వాడ్‌ 53 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే. . తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 175 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్‌.. 19 ఫోర్ల సాయంతో 132 పరుగులు సాధించాడు. చమిక గుణశేఖర బౌలింగ్‌లో దులాజ్‌ సముదితకు క్యాచ్‌ ఇచ్చి సాయి పెవిలియన్‌ చేరాడు.

తుదిజట్లు
భారత్‌
సాయి సుదర్శన్, ఆయుశ్‌ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధృవ్ జురెల్(కెప్టెన్‌/ వికెట్‌ కీపర్‌), షేక్ రషీద్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆకిబ్ నబీ దర్

శ్రీలంక
పవంత వీరసింగే, నిరోషన్‌ డిక్‌విల్లా (వికెట్‌ కీపర్‌), నునానిదు ఫెర్నాండో, ఆషేన్‌ బండారా, సహాన్‌ అరాచిగే (కెప్టెన్‌), రవిందు ఫెర్నాండో, అంజాలా బండారా, కవిందు పతిరత్నె, దులాజ్‌ సముదిత, చమిక గుణశేఖర, దిలుమ్‌ సుదీర.

చదవండి:  కన్నీటి పర్యంతమైన నెయ్‌మార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement