PC: X
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’- భారత్ -‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దంబుల్లాలో సోమవారం టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. లంక బౌలర్ల ధాటికి 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
మ్యాచ్ ‘టై’
ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాల వల్ల భారత్‌కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, విప్రాజ్ నిగమ్ పిచ్ మధ్యభాగంలో రెండుసార్లు పరిగెత్తడం వల్ల భారత్‌కు పది పరుగుల పెనాల్టీ పడింది. దీంతో 10/0తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేసింది.
ఫలితంగా మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 పరుగులు చేసింది. అనంతరం భారత్ తరఫున బ్యాటింగ్‌కు దిగిన వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి బంతికి సూర్యాంశ్ రెండు పరుగులు తీయగా.. తర్వాత పరుగేమీ రాలేదు.
భారత్ ఓటమి
ఆ తర్వాత వైభవ్ రెండు పరుగులు తీయగా.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. వైభవ్ పరుగులేమీ తీయలేకపోయాడు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్న శ్రీలంక ప్లేయర్లలో ఎవరో వైభవ్‌ను ఏదో అన్నట్లుగా కనిపించింది.
శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్
దీంతో కోపంతో శ్రీలంక ఆటగాళ్లపై దూసుకువెళ్లిన పదిహేనేళ్ల వైభవ్ వారిని నెట్టేశాడు. ఇంతలో అంపైర్, సూర్యాంశ్ వచ్చి అతడిని వారి నుంచి విడదీశారు. ఆ తర్వాత కూడా వైభవ్ చేయి చూపిస్తూ కోపంతో ఊగిపోతూ మైదానం వీడాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. వైభవ్ దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులు.. హైడ్రామా
🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭
Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳
- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026


